Monday, December 16, 2024

ముంబయిలో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో బాంబులు పెట్టామంటూ ఓ అగంతకుడు చేసిన ఫోన్ పోలీసులను పరుగులెత్తించింది. ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు శుక్రవారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామని చెప్పాడు. పోలీసులు బాంబు స్కాడ్‌తో ఆరు ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడ పేలుడు పదార్థాలు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.  గతంలో ముంబయిలో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. గతంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు చెప్పారు. అంతకు ముందు కూడా ఆర్‌బిఐ ఆఫీసులతో సహా పలు బ్యాంకుల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా బాంబు బెదిరింపులు వచ్చాయి. అన్నీ ఫేక్ కాల్స్ అని తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News