Wednesday, January 22, 2025

95 విమానాలకు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు బూటకపు బాంబు బెదిరింపుల పర్వం నిరంతరాయంగా సాగుతోంది. గురవారం కూడా ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, అలయన్స్ ఎయిర్, ఆకాశ ఎయిర్ వంటి వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దాదాపు 95 విమానాలు బాంబు బెదిరింపులను ఎదుర్కొన్నాయి. గడచిన 10 రోజులలో 250కి పైగా విమానాలు బాంబు బెదిరింపులను ఎదుర్కొన్నాయి. 25 ఆకాశ ఎయిర్ విమానాలు, ఎయిర్ ఇండియా, ఇండితో, విస్తారాకు చెందిన 20విమానాల చొప్పున, స్పైస్‌జెట్, అలయన్స్ ఎయిర్‌కు చెందిన ఐదేసి విమానాలు గురువారం బాంబు బెదిరింపులను ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు.

ఇంతకుముందు 170కి పైగా విమానాలు బాంబు బెదిరింపులను ఎదుర్కోగా ఈ బెదిరింపులలో అధిక శాతం సోషల్ మీడియా వేదికల నుంచే రావడం గమనార్హం. ఇవన్నీ బూటకపు బెదిరింపులని ఆ తర్వాత తేలిపోయినప్పటికీ వందలాది మంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడంతోపాటు భద్రతా సిబ్బందికి, విమానయాన సంస్థలకు తలనొప్పిగా మారిన ఈ ఘటనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ బాంబు బెదిరింపులకు పాల్పడేవారిని నో ఫ్లై లిస్టులో చేర్చడంతోపాటు వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విషయాన్ని యోచిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయడు ఇటీవల ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News