Friday, April 4, 2025

సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని పలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) పాఠశాలలకు మంగళవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్‌లు రావడంతో ఆందోళన స్పష్టించింది. ఢిల్లీ లోని రెండు పాఠశాలలు, హైదరాబాద్‌లోని ఒక పాఠశాల బెదిరింపుల లక్ష్యాలు వచ్చాయి. ఇవీ సోమవారం అర్థరాత్రి వచ్చినట్లు తెలుస్తుంది. న్యూ ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ ప్రాంతం లోని పాఠశాల గోడ నుండి బలమైన పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత ఇలా బెదిరింపులు రావడం సంచలనంగా మారిం ది.

మే నెలలో ఢిల్లీలోని 131 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చినప్పుడు ఇలా వచ్చాయి. ఈమెయిల్స్‌లో ‘స్వరైమ్’ అనే పదం ఉంది. ఇది ఇస్లామిక్ స్టేట్ ఇస్లామిస్ట్ ప్రచారాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించే అరబిక్ పదం అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. బెదిరింపులు బూటకమని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడు దల చేసింది. ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News