Sunday, December 22, 2024

ఢిల్లీలో ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. ఆదివారం పలు ఆస్పత్రులకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ లోని బురాయి, సంజయ్ గాంధీ ఆస్పత్రులు సహా పది ఆస్పత్రులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని సమాచారం అందడంతో పోలీస్‌లు, బాంబుస్వాడ్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అయితే అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఇటీవల 150 కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News