Wednesday, November 6, 2024

కమలాహారిస్ భర్తకు బాంబు బెదిరింపులు…

- Advertisement -
- Advertisement -

సురక్షిత ప్రాంతానికి తరలింపు

వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ భర్తకు బాంబు బెదిరింపులు రావడంతో ఆయనను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. కమలాహారిస్ భర్త డగ్లస్ ఎమహాఫ్‌ను అధికారికంగా దేశ రెండో పౌరుడుగా గుర్తిస్తుంటారు. వాషింగ్టన్ లోని డన్‌బార్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే బ్లాక్‌హిస్టరీ సంస్మరణ కార్యక్రమానికి హాజరుకాడానికి ఆ స్కూలుకు వెళ్లారు. అక్కడ స్కూల్‌ను పరిశీలించిన తరువాత ఐదు నిమిషాలపాటు పాఠశాల మ్యూజియంలో ఉన్నారు. అయితే బాంబు బెదిరింపులు రావడంతో భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన బయటకు తీసుకెళ్లిపోయారు. మరోవైపు పాఠశాల భవనాన్ని ఖాళీ చేయాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని హెచ్చరిస్తూ ఓ ప్రకటన చేశారు. బాంబు బెదిరింపు విషయాన్ని వాషింగ్టన్ పబ్లిక్ స్కూల్ ప్రతినిధి ఎన్‌రిక్ గుటిరెజ్ వెల్లడించారు. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని, అందరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. బాంబు బెదిరింపు వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. అయితే ఎమ్‌హాఫ్ అధికార ప్రతినిధి కాటీ పీటర్స్ స్కూల్ వద్ద నున్న సెక్యూరిటీ సిబ్బందిని సీక్రెట్ ఏజెన్సీ అప్రమత్తం చేసిందని ట్విటర్‌లో తెలియచేశారు. ఈ బెదిరింపులు ఎమ్‌హాఫ్ సందర్శనకు సంబంధించినవా ? లేక బ్లాక్‌హిస్టరీ మంత్ కార్యక్రమానికి సంబంధించినవా ? అనేది స్పష్టంగా తెలియదని గుటెరెజ్ చెప్పారు. దీనిపై నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News