Sunday, December 22, 2024

రాజస్థాన్‌లో రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లోని పలు రైల్వేస్టేషన్‌లకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. రాజస్థాన్ లోని హనుమాన్ ఘర్ జంక్షన్ లోని స్టేషన్ సూపరింటెండెంట్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఓ లెటర్ ఇచ్చాడు. ఆ లేఖ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉంది. అందులో శ్రీరంగా నగర్, బికనీర్, జోధ్‌పుర్, కోట, బుందీ, ఉదయర్‌పుర్, జైపుర్‌తో సహా పలు స్టేషన్లలో బాంబుదాడులు జరగనున్నాయని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తమయ్యారు. బీఎస్‌ఎఫ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News