Saturday, December 21, 2024

చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్ అక్రమమే: బొంబే హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐసిఐసిఐ బ్యాంక్ వీడియో కాన్ రుణమోసం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ల అరెస్టులు చట్టానికి అనుగుణంగా జరగలేదని ఇవి అక్రమమేనని బోంబై హైకోర్టు సోమవారం వెల్లడించింది. వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరిద్దరూ జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదల కాబోతున్నారు. ఈ కేసులో వీరితోపాటు వీడియో కాన్ గ్రూపు ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్, నూపవర్ రెన్యుబుల్స్‌కు చెందిన దీపక్ కొచ్చర్‌ను కూడా సిబిఐ డిసెంబర్ 23న అరెస్టు చేసింది.

సిబిఐ ఆరోపణల ప్రకారం ఐసీఐసీఐ బ్యాంకుకు చందా కొచ్చర్ సీఈఓగా పనిచేసిన కాలంలో వీడియోకాన్ కంపెనీకి 2012 లో ఆ బ్యాంకు రూ. 3250 కోట్ల రుణం ఇచ్చింది. ఇది నిర్ణీత నిబంధనలకు విరుద్ధంగా ఆరోపించింది. కొచ్చర్ దంపతులు, వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెట్ ఈ కేసులో నిందితులుగా నమోదు చేసింది.

అయితే ఈ కేసులో కొచ్చర్ దంపతుల అరెస్టులు చట్టానికి అనుగుణంగా లేవని, అందువల్ల వారిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. చెరో రూ. 1 లక్ష నగదు పూచీకత్తు, అంతే విలువ గల ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది జామీను దారుల హామీపై వారిని విడుదల చేయాలని ఆదేశించింది. పాస్ పోర్టులను దర్యాప్తు అధికారులకు అప్పగించాలని ఈ దంపతులకు సూచించింది. జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పీకే చావన్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును ఇచ్చింది.

క్రిమినల్ కోడ్ లోని 41వ సెక్షన్‌ను ఉల్లంఘించి ఆ ఇద్దరిని అరెస్టు చేసినట్టు కోర్టు తెలిపింది. జనవరి 15న తమ కుమారునికి వివాహానికి హాజరయ్యేందుకు తమకు బెయిలు మంజూరు చేయాలని కొచ్చర్ దంపతులు వేర్వేరుగా అంతకు ముందు దరఖాస్తు చేసుకున్నా కోర్టు ఆ పిటిషన్లను పరిగణన లోకి తీసుకోలేదు. అయినా ఇప్పుడు కుమారుని వివాహానికి ముందే బెయిల్ లభించడం వారికి ఊరట కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News