Saturday, December 21, 2024

కొచ్చార్ దంపతులకు బెయిలు!

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్‌లకు బాంబే హైకోర్టు సోమవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వారిని సిబిఐ వీడియోకాన్ రుణం కేసులో అరెస్టు చేసింది. వారు దాదాపు పక్షం రోజులుగా కస్టడీలో ఉన్నారు. న్యాయమూర్తి రేవతి మోహితేదేరే, న్యాయమూర్తి పృత్వీరాజ్ కె. చావాన్‌లతో కూడిన ధర్మాసనం వారి అరెస్టు సిఆర్‌పిసి 41ఏని ఉల్లఘించిందని, తద్వారా వారిని సంబంధిత పోలీసు అధికారుల ముందు హాజరు కమ్మని నోటీసులు పంపడానికి ఉపయోగపడిందని పేర్కొన్నారు. తలా లక్ష రూపాయల మొత్తంపై వారిని బెయిల్‌పై విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కొచ్చార్ దంపతులను డిసెంబర్ 24న అరెస్టు చేశారు. సిబిఐ కోర్టు మొదట వారిని సిబిఐ కస్టడీకి అప్పగించింది. తర్వాత డిసెంబర్ 29న వారిని జుడీషియల్ కస్టడీకి పంపింది. ఆ తర్వాత కొచ్చార్ దంపతులు తమ అరెస్టును బాంబే హైకోర్టులో సవాలు చేశారు. దానిపై సోమవారం వారికి ఊరట కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News