- Advertisement -
ముంబై : పరువు నష్టం దావాకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బొంబాయి హైకోర్టు ఊరట కల్పించింది. ఆయన ఈ కేసుకు సంబంధించి ఆగస్టు రెండవ తేదీ వరకూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావల్సిన అవసరం లేదని తెలిపింది. 2018లో ప్రధాని మోడీని రాహుల్ కించపరుస్తూ మాట్లాడారనే అంశం చివరికి ఆయనపై పరువునష్టం దావాకు దారితీసింది. అయితే ఇప్పుడు దాఖలైన కేసు ప్రధాని మోడీని రాహుల్
రాఫెల్ యుద్ధ విమానాల డీల్ విషయంలో గజ దొంగ అని పేర్కొనడంపై దాఖలు అయింది. దీనికి సంబంధించి ఆయన వ్యక్తిగత హాజరీపై ఉన్న స్టేను ఆగస్టు వరకూ పొడిగిస్తున్నట్లు ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి ఎస్‌వి కోత్వాల్ తెలిపారు. అయితే మోడీని ఇంటిపేరుతో తిట్టాడని ఆరోపిస్తూ రాహుల్‌పై దాఖలైన వ్యాజ్యంలో ఆయన ఎంపి పదవిపై అనర్హత వేటు విధిస్తూ, జైలుశిక్షను కూడా గుజరాత్‌లోని సూరత్ కోర్టు ప్రకటించింది.
- Advertisement -