Sunday, November 3, 2024

మూడేళ్ల బాలికపై హత్యాచారం కేసు

- Advertisement -
- Advertisement -

Bombay HC upholds death sentence of 30-year-old Man

మూడేళ్ల బాలికపై హత్యాచారం కేసు
నిందితుడికి మరణ శిక్షను
ధ్రువీకరించిన బాంబే హైకోర్టు

ముంబయి: మూడేళ్ల బాలికపై ఆత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన 30 ఏళ్ల యువకుడికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు గురువారం ధ్రువీకరనించింది. నిందితుడు పాల్పడిన చర్య అత్యంత దారుణమైనది, అమానుషమైనదని, ఒక బాలిక రక్షణ సమాజానికి అన్నిటికన్నా ముఖ్యమైనదని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.2019 మార్చిలో పోస్కో చట్టం కింద లైంగిక నేరాలను విచారించే ప్రత్యేక కోర్టు రాం కీరత్ గౌడ్ అనే నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును న్యాయమూర్తులు సాధనా జాదవ్, పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ధ్రువీకరించింది. ‘నిందితుడి చర్య అత్యంత క్రూరమైనది, పాశవికమైనది.

తన పెంపుడు కుక్కతో ఆడుకొంటున్న ముద్దులొలికే చిన్నారి ముగ్గురు బిడ్డల తండ్రి అయిన ఒక వ్యక్తి కామవాంఛలను రెచ్చగొడుతుందనేదే ఊహకు అందని విషయం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.2013 సెప్టెంబర్‌లో ఠాణె జిల్లాలో తన ఇంట్లో పెంపుడు కుక్కతో ఆడుకొంటున్న మూడేళ్ల చిన్నారిపై అదే ప్రాంతంలో ఒక భవనంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్న గౌడ్ అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశాడు. మృతురాలి మృతదేహాన్ని దగ్గర్లోని బురదగుంటలో కనుగొన్నారు. హత్య చేయడానికి ముందు చిన్నారిపై అమానుషంగా దాడి చేసినట్లు పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తోందని, నిందితుడి చర్య అత్యంత అరుదైన నేరాల కిందికి వస్తుందని బెంచ్ పేర్కొంటూ, ఒక మొగ్గను వికసించడానికి ముందే చిదిమేసిన నిందితుడికి కింది కోర్టు మరణ శిక్ష విధించడం సరైనదేనని అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News