Saturday, November 23, 2024

కుంద్రా జైలు కరెక్టే

- Advertisement -
- Advertisement -
Bombay High Court dismisses Raj Kundra's plea
విడుదల పిటిషన్ కొట్టివేత

ముంబై:  నీలి చిత్రాల కేసులో అరెస్టు అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ఎదురుదెబ్బతగిలింది. తనను వెంటనే విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు శనివారం తిరస్కరించింది. కుంద్రా గత నెలలో అరెస్టు అయ్యి జైలుపాలయ్యాడు. ప్రముఖ అందాల నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా తన అరెస్టు అక్రమంగా జరిగిందని పిటిషన్‌లో తెలియచేసుకున్నారు. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి అందిన రిమాండ్ ఆదేశాలకు ముందు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, సమన్లు కూడా వెలువరించలేదని, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ పరిధిలో చూస్తే ఇది తప్పనిసరి అని కుంద్రా తరఫు న్యాయవాది తెలిపారు. అయితే ఆయన రిమాండ్ ఆర్డర్ తరువాత జుడిషియల్ కస్టడీ అంతా కూడా పద్ధతి ప్రకారం జరిగిందని, సంబంధిత ఆదేశాలు వెలువరించిన మెజిస్ట్రేట్ ఉత్తర్వులలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని పేర్కొంటూ, కుంద్రా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News