Monday, November 18, 2024

ఎల్గార్ పరిషత్ కుట్ర కేసు.. మహేష్‌రౌత్‌కు హైకోర్టు బెయిల్

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎల్గార్ పరిషత్ కుట్రకేసులో నిందితుడు ఉద్యమనేత మహేష్ రౌత్‌కు బొంబై హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌లు ఎఎస్ గడ్కరీ, షర్మిలా దేశ్‌ముఖ్ పరిశీలించి బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో 2018 జూన్‌లో రౌత్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఆయన ఉన్నారు. ఆయన బెయిల్‌ను ఎన్‌ఐఎ కోర్టు తిరస్కరించడంతో ఆయన 2022లో హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని, దీనిపై సుప్రీం కోర్టుకు అపీలు చేస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఎ) మొదట అభ్యర్థించగా ఒక వారం పాటు కోర్టు స్టే విధించింది. ఈ కేసులో 16 మంది ఉద్యమనేతలు అరెస్ట్ కాగా, వీరిలో ఐదుగురు ప్రస్తుతం బెయిల్‌లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News