Friday, January 3, 2025

జైలులో ప్రసవం.. తల్లి బిడ్ద ఇద్దరిపైన దుష్ప్రభావం

- Advertisement -
- Advertisement -

మాదకద్రవ్యాల కేసుల అరెస్టు అయిన ఒక గర్భిణికి బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఆరు నెలలు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జైలు వాతావరణంలో శిశువును ప్రసవించడం తల్లి, బిడ్ద ఇద్దరిపైన ప్రభావం చూపుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. తుదకు ఒక ఖైదీ కూడా గౌరవానికి అర్హత ఉందని, జైలులో శిశువును ప్రసవించడం విపరిణామాలకు దారి తీయవచ్చునని జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కె నాయకత్వంలో సింగిల్ జడ్జి బెంచ్ ఈ నెల 27న వెలువరించిన తీర్పులో పేర్కొన్నది. మహిల సురభి సోనిని ఆరు మాసాల పాటు తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టన్సెస్ (ఎస్‌డిపిఎస్) చట్టం నిబంధనల కింద సోనిని గత ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. గోండియా రైల్వే భద్రత దళం ఒక రైలులో దాడి నిర్వహించి, సోనితో సహా ఐదుగురు వ్యక్తుల నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, నిందితుల దగ్గర నుంచి 33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఏడు కిలోల గంజాయి సోని లగేజ్‌లో దొరికింది. అరెస్టు సమయంలో ఆమె రెండు మాసాల గర్భవతి. జైలు వెలుపల తన బిడ్డను ప్రసవించేందుకు వీలుగా మానవతా దృక్ఫతంతో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News