Friday, December 27, 2024

బొంబాయి హైకోర్టు జడ్జి రాజీనామా

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి రోహిత్ దియో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. శుక్రవారం తస కోర్టురూంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించినా, తాను ఆత్మగౌరవం పట్ల రాజీపడేది లేదని ఆయన చెప్పినట్లు అక్కడున్న ఓ లాయర్ చెప్పడం పలు ఊహాగానాలకు దారితీసింది. జడ్జి రాజీనామాతో శుక్రవారం ఆయన పరిధిలోకి వచ్చే కేసుల విచారణను ఇతరులకు అప్పగించారు.

తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాననే సంతృప్తి ఉందని, ఇంతకాలం వివిధ స్థాయిల్లో తనకు సహకారం అందించిన వారందరికి ధన్యవాదాలు అని తెలిపారు. 2022లో జస్టిస్ రోహిత్ తమ ముందుకు వచ్చిన కేసులో విచారణ దశలో ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను మావోయిస్టు లింక్‌ల ఉదంతంలో నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన యావజ్జీవ జైలుశిక్షను కొట్టివేశారు. తరువాత ఈ తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. సాయిబాబాపై కేసును నాగ్‌పూర్ హైకోర్టు బెంచ్ విచారించాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News