ముంబయి: దిగ్గజం బిల్‌గేట్స్‌కు బొంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బిల్‌గేట్స్‌తోపాటు సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డాక్టర్ వీజీ సోమని, డ్రగ్ కంట్రోలర్ జనరల్, డాక్టర్ రణదీప్ గులేరియా, డైరెక్టర్ ఆఫ్ ఎఐఐఎంఎస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె మరణానికి కొవిషీల్డ్ కారణమని ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతో బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైద్యురాలు, సీనియర్ లెక్చరర్ ఎస్‌ఎంబిటి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తమ కుమార్తె మరణానికి వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్టు కారణమని పేర్కొన్న పిటిషనర్ దిలీప్ లున్వత్ పేర్కొన్నారు. ప్రతివాదిగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కూడా చేర్చారు. భారత్‌లో టీకా తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి వెయ్యికోట్ల పరిహారం డిమాండ్ చేశారు. 2020లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా ప్రతివాదులకు శుక్రవారం నోటీసులు జారీ చేసిన ఎస్వీ గంగాపూర్వలా, మాధవ్ జమ్దార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
బిల్‌గేట్స్‌కు బాంబే హైకోర్టు నోటీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -