సెంట్రల్ ముంబైలోని గందేవిలోగల గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయా షెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు విధించిన జావజ్జీవ కారాగార శిక్షను సస్పెండ్ చేసిన బాంబే హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. 2001 మే 4న తన హోటల్‌లోని మొదటి అంతస్తులో ఉన్న జయా షెట్టిని ఛోటా రాజన్ అనుచరులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఛోటా రాజన్ ప్రధాని అనుచరుడు హేమంత్ పూజారి నుంచి జయా షెట్టి బెదిరింపు కాల్స వచ్చాయని,
డబ్బు చెల్లించకపోవడంతోనే షెట్టిని ఛోటా రాజన్ ముఠా హత్య చేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఛోటా రాజన్‌కు జావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు ఏ ఏడాది మే తీర్పు ఇచ్చింది. కాగా.. యావజ్జీవ శిక్షను రద్దు చేసి తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఛోటా రాజన్ బాంబే హైకోర్టులో అప్పీలు చేసుకోగా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అయితే ఇతర ఇతరులను కూడా ఎదుర్కొంటున్న ఛోటా రాజన్ బెయిల్ వచ్చినప్పటికీ జైలులోనే ఉండక తప్పదు.