Monday, December 23, 2024

విషాదం.. హాస్టల్ భవనం పైనుంచి దూకి ఐఐటి పీజి విద్యార్థి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

ముంబై: బాంబే ఐఐటిలో విషాదం చో్టుచేసుకుంది. సోమవారం ఉదయం పోవైలో ఉన్న ఐఐటిలోని హాస్టల్ భవనం ఏడో అంతస్తు పైనుంచి పీజి విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన విద్యార్థి దర్శన్ మాలవీయ(26)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డిప్రెషన్ కారణంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Bombay IIT PG Student Jumps off from hostel roof

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News