Sunday, December 22, 2024

ఒమన్ తీరంలో ఆయిల్ టాంకర్‌ను ఢీకొన్న బాంబుల డ్రోన్

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : మధ్యప్రాచ్యంలో టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య గత కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఒమన్ తీరంలో ఇజ్రాయెల్ బిలియనీర్‌కు చెందిన ఆయిల్ టాంకర్‌ను బాంబులతో ఉన్న డ్రోన్ ఢీకొట్టింది. ఒమన్ తీరానికి 150 మైళ్ల దూరంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని మధ్యప్రాచ్యానికి చెందిన రక్షణ అధికారి అనధికారికంగా వెల్లడించారు. ఈ సంఘటన తమకు తెలుసని, దీనిపై దర్యాప్తు జరగాలని ఆ రీజియన్‌లోని బ్రిటిష్ మిలిటరీ ఆర్గనైజేషన్ పేర్కొంది. లిబీరియా పతాకం ఉన్న ఆయిల్ టాంకర్ పసిఫిక్ జిక్రాన్‌గా అధికారులు గుర్తించారు. సింగపూర్‌కు చెందిన ఈస్టర్న్ పసిఫిక్ షిప్పింగ్ ఈ టాంకర్‌ను నిర్వహిస్తోంది. ఈ నౌక సిబ్బందితో తాము ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, ఎవరైనా గాయపడడం కానీ, కాలుష్యం కానీ ఏవీ జరగలేదని నౌక సిబ్బంది చెప్పారని నౌకకు చెందిన కంపెనీ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News