- Advertisement -
పశ్చిమ బెంగాల్ : కోల్‌కతాలో మరోసారి బాంబులు కలకలం సృష్టించాయి. కోల్‌కతా ఖిద్దర్‌పూర్ హేస్టింగ్ క్రాసింగ్ ఏరియాలో సుమారు 50కిపైగా ముడి బాంబులను పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. బాంబులు దొరికిన ప్రదేశానికి దాదాపు 20 మీటర్ల దూరంలోనే ఎన్నికల సమయంలో బిజెపి ఏర్పాటు చేసుకున్న కార్యాలయం ఉన్నది. పండ్ల ప్యాకింగ్‌కు వినియోగించే నాలుగు సంచుల్లో బాంబులను గుర్తించగా.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాండ్ స్క్వాడ్, యాంటీ రౌడీ స్క్వాడ్ విభాగానికి చెందిన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. బాంబులు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -