Wednesday, January 22, 2025

ఎన్‌డిఎలో చేరికపై జెడి(ఎస్)తో చర్చలు

- Advertisement -
- Advertisement -

హుబ్బళ్లి: వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు జెడి(ఎస్) జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డిఎ)లో చేరడానికి సంబంధించి బిజెపి, జెడి(ఎస్)ల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బస్వరాజ్ బొమ్మై ఆదివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ రెండు పార్టీల మధ్య జరిగే చర్చల ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలను నిర్ణయిస్తాయని కూడా ఆయన చెప్పారు. జెడి(ఎస్) ఎన్‌డిఎలో చేరుతుందా అన్న విలేఖరుల ప్రశ్నకు ‘బిజెపి అధినాయకత్వం, జెడి(ఎస్) అధినేత హెచ్‌డి దేవెగౌడ మధ్య జరిగే చర్చల్లో అది నిర్ణయించబడుతుంది’అని బొమ్మయి అన్నారు. ఈ దిశగా చర్చలు కొనసాగుతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.‘ ఈ చర్చల ఫలితాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఉంటాయి’ అని ఆయన అన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి, జెడి(ఎస్)లు చేరువ కావడం గురించి ఇటీవలి కాలంలో ఈ రెండు పార్టీల నేతలు చాలా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పార్టీ, జెడి(ఎస్)లు కలిసి పోరాటం చేస్తాయని బిజెపి సీనియర్ నేత బిఎస్ యెడియూరప్ప గతంలో చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ అవగాహనకు సంబంధించి సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని జెడి(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చెప్పడం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కర్నాటకలోని మొత్తం 28 స్థానాలకుగాను 25సీట్లను గెలుచుకోగా, ఆ పార్టీ మద్దతుతో సినీనటి సుమలత ఇండిపెండెంటుగా మండ్యనుంచి గెలుపొందారు. కాగా కాంగ్రెస్, జెడి(ఎస్)లు చెరో సీటు గెలుచుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News