Friday, January 10, 2025

‘రైతుబీమా’కు బొమ్మై జై

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభ్యున్నతే లక్షంగా కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు జాతీయ స్థాయి పథకాలుగా మార్పులు చెందుతూ దశదిశల విస్తరిస్తున్నాయి. అందులో ప్రధానంగా రైతుబంధు , రైతుబీమా పథకాలు దేశంలోని ప్రతి రైతును ఆకర్షించి వాటి అమలుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి పెంచుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో బసవరాజబొమ్మై సర్కారు కూడా తెలంగాణ రైతుబీమా పథకం అమలుకు స్వీకరించింది. కన్నడ రైతుకు బీమా కల్పిస్తూ వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచే రైతుబీమా పధకాన్ని అమల్లోకి తెవాలని నిర్ణయించింది. అయితే రైతుబంధు పేరు మార్చి జీవనజ్యోతి బీమా పథకంగా కర్నాటకలో అమలుకు శ్రీకారం చుట్టింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో జీవనజ్యోతి బీమా పథకం అమలుకు రూ.180కోట్లు కేటాయించింది. రైతుల పక్షాన బీమా కంపెనీలకు బొమ్మె సర్కారు ఈ నిధులను ప్రీమియంగా చెల్లించనుంది. ఈ బీమా పథకం అమలు ద్వారా కర్నాటకలో 56లక్షల మంది రైతు కుంటుంబాలకు ధీమా ఏర్పడనుంది.

తెలంగాణ రాష్ట్రంలో 2018నుంచి కేసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం వ్యవసాయరంగంలో తొలి వినూత్న పథకంగా ప్రపంచదృష్టిని ఆకర్షించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతుకుటుంబాలను ఆదుకుంటూ వస్తోంది. రైతు ఏకారణం చేత మృతి చెందినప్పటికీ ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షలు ఆర్ధిక సాయం వారంరోజుల్లోపే అందిస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో 96,063 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా , ఆ రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.48,03.15కోట్లు ఆర్ధికసాయం అందజేసింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కూడా వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా కింద రూ.1589కోట్లు కేటాయించింది. రైతు ఒక్క పైసా చెల్లించకుండానే రైతుల పక్షాన ప్రభుత్వమే ఈ మొత్తాన్ని బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించనుంది. ఇదే రైతుబీమా పథకాన్ని కర్నాటకలోని బిజేపి ప్రభుత్వం జీవనజ్యోతి బీమా పథకంగా పేరు మార్చి అమల్లోకి తెస్తొంది.

ఆ రాష్ట్రంలో ఉన్న సుమారు 56లక్షల రైతు కుటుంబాల పక్షాన ప్రీమియంగా చెల్లించేందుకు వచ్చే ఏడాదకి బడ్జెట్‌లో రూ.180కోట్లు కేటాయించింది. రైతులకు పడ్డీలేకుండా బ్యాంకుల ద్వారా ఇస్తున్న రుణాల పరిమితిని కూడా రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. ఈ పథకంలో 30లక్షల మంది రైతులకు రూ.25వేలకోట్లు రుణాలుగా అందిస్తామని బొమ్మై సర్కారు ప్రకటించింది. కిసాన్ క్రెడిట్ కార్డు దారులకు భూసిరి పథకంలో భాగంగా వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అత్యవసర పరిస్థితుల్లో విత్తనాలు , ఎరువులు ,క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసుకునేందుకు రూ.10వేలు అదనపు సహాయాన్ని అందించనున్నట్టు ప్రకటించింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ బడ్జెట్‌లో రూ.50కోట్లు కేటాయించింది. ఇస్రో సహకారంతో డిజిటల్ సేద్యంలో జియోస్పేషియల్ సాంకేతికను అలవర్చేందుకు రూ.50కోట్లతో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. తెలంగాణలో పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.10వేలు అందజేజ్తూ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న రీతిలోనే కర్నాటక ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతుసిరిలో భాగంగా రైతుకు ప్రతి హెక్టారుకు రూ.10వేలు ప్రొత్సాహకాన్ని ప్రకటించింది. వచ్చే నాలుగేళ్లలో లక్ష హెక్టార్లకు పెంచాలని లక్షంగా పెట్టుకుంది.

సిఎం కేసిఆర్‌కు కన్నడ రైతుల జేజేలు

కర్ణాటకలో బోమ్మై సర్కారు రైతుబీమా పథకాన్ని జీవనజ్యోతి బీమా పేరుతో అమలుకు స్పూర్తిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కన్నడ రైతులు జేజేలు పలుకుతున్నారు గత ఏడాది కాలంగా దక్షిణ భారత రైతుసంఘాల సమాఖ్య అధ్యర్వంలో కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ సంక్షేమ పథకాల అమలు పట్ల కన్నడ రైతులు సంపూర్ణ అవగాహన పెంచుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు , రైతుబీమా పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్ల డిమాండ్లతో కర్ణాటక రాష్ట ప్రభుత్వంపై వత్తడి పెంచుతూ వచ్చారు. రైతు సంఘాల ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి బొమ్మైని కలిసి తెలగాణ రైతుబందు, రైతుబీమా పథకాలను వివరించి అటువంటి పథకాలనే ఇక్కడి రైతులు కోరుకుంటున్నారని వివరించారు. వాటిని అమలు చేయాలని చేసిన కృషి ఫలించింది. వచే ఏడాది నుంచి జీవనజ్యోతి బీమా సదుపాయం కర్ణాటకలో కూడా ఆందుబాటులోకి వస్తున్నందుకు ఆ రాష్ట్ర రైతులు , రైతు సంఘాల నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ణతలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News