- Advertisement -
బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై పోలీస్ కానిస్టేబుల్ అత్యాచారం చేసిన సంఘటన కర్నాటకలోని బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పక్కింట్లో కానిస్టేబుల్ బాలికతో పరిచయం చేసుకొని ఓ హోటల్ రూమ్ కు తీసుకెళ్లాడు. హోటల్ రూమ్ లో బీరులో నిద్రమాత్రలు వేసి తాగించాడు. బాలిక స్పృహ తప్పి పడిపోయిన తరువాత ఆమెపై కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. బాలికపై అత్యాచారం చేస్తుండగా వీడియో తీశాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్ లో చెబితే సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. జరిగిన విషయం బాలిక తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -