Monday, January 20, 2025

ప్రశాంతంగా ముగిసిన బోనాలు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: బోనాల సందర్భంగా నిర్వహించనున్న ఘట్టం ర్యాలీని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రారంభించారు. అక్కన్నమాధన్న టెంపుల్ మేనేజ్‌మెంట్ ఆహ్వానం మేరకు సోమవారం హాజరైన నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడారు. గత నెల జూన్ 22వ తేదీన గోల్కొండ టెంపుల్‌లో బోనాలతో ప్రారంభమయ్యాయని తెలిపారు. తర్వాత ఉజ్జయిని మహంకాళి టెంపుల్, శ్రీసింహవాహిని మహంకాళి టెంపుల్, లాల్‌దర్వాజా తదితర ప్రాంతాల్లో బోనాల పండగ చేసుకున్నారని తెలిపారు.

బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని, ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. నగర పోలీసులు బోనాల బందోబస్తు కోసం ఆహర్నిశలు పనిచేశారని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారుల సహాకారంతో విజయవంతంగా నిర్వహిచామని తెలిపారు. అంబరీపై నిర్వహించిన ర్యాలీని హరిబౌలి వద్ద ప్రారంభమైంది. కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ విక్రం సింగ్‌మాన్, ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, జాయింట్ సిపి ట్రాఫిక్ శ్రీనివాసులు, డిసిపి సాయిచైతన్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News