Wednesday, December 25, 2024

మల్కాజిగిరిలో అంగరంగ వైభవంగా బోనాలు

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: తెలంగాణ, సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకైన బోనాల ఉత్సవాలు ఆదివారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వివిధ డివిజన్‌లలో ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గౌతంనగర్ డివిజన్ పరిధిలోని జెఎల్ ఎస్‌ఎన్‌నగర్, ఐఎన్‌నగర్‌లలో బోనాల సందర్భంగా మహిళలు తమ తలపై బోనం ఎత్తుకొని ఆలయాలకు తరలి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. అదే విధంగా ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని ఉప్పరిగూడ లెప్రసీ కాలనీలోని పోచమ్మ ఆలయం వద్ద బోనాలను ఘనంగా నిర్వహించారు.

అమ్మవారి దేవాలయాలను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్లు మేకల సునిత రాముయాదవ్, ప్రేమ్‌కుమార్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు అతిధులను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ… బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, స్రంపదాయాలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. అమ్మవారి కృపతో వర్షాలు బాగా కురుస్తున్నాయని, పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో సీనియర్ నాయకులు మేకల రాముయాదవ్, సాధుపరమేష్, బాబు, సత్యనారాయణ, సంపత్‌రావు ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News