Saturday, January 11, 2025

బోనాల పండుగ నిధులకు దరఖాస్తు చేసుకోవాలి : ఎంఎల్‌ఎ గాంధీ

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంసృ్కతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దేవాలయాల నిర్వాహకులు పొందడానికి జూన్ 21వ తేదీలోగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాత వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ చక్కటి అవకాశాన్ని దేవాలయాల నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని, గుడి పేరు మీద ఉన్న లెటర్ హెడ్, గుడి పేరు మీద ఉన్న బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, గుడి ఫొటోలు, దేవాలయం చైర్మన్ లేదా కార్యదర్శి ఆధార్ కార్డ్ జిరాక్స్ జత చేసి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News