Thursday, January 23, 2025

తార్నాక బోనాల ఉత్సవాలలో కత్తిపోట్లు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తార్నాకలోని బోనాల ఉత్సవాలలో గొడవలు జరగడంతో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.  తార్నాక స్ట్రీట్ నంబర్10లో అమ్మవారి దేవాలయం వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించారు. స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కత్తులతో పొడుచుకున్నారు. గాయాలపాలైన ముగ్గురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ముగ్గురు గంజాయి అమ్మడంతోపాటు గంజాయి సేవిస్తారని సమాచారం. గంజాయి వివిధ రేట్లకు అమ్ముతుండడంతో గొడవ ప్రారంభమైంది. మాట్లాడుకుందాం అని తార్నాక ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైకి వెళ్లి కత్తులతో దాడి చేసుకున్నారు. ఉస్మానియా పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి నుంచి సమాచారం తీసుకొని విచారణ చేస్తున్నారు. గాయపడిన వారు సూర్య, హరీష్, లోకేష్ గా గుర్తించారు.

Also Read: నిద్రిస్తున్న మైనర్ బాలుడిపై కానిస్టేబుల్ కర్కశత్వం.. (వీడియో వైరల్)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News