Wednesday, January 22, 2025

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలో 24వ డివిజన్ కిసాన్‌నగర్ కాళికామాత ఆలయం రాంనగర్ మున్నూరు కాపు ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషం గా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని, ఆ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్‌రావు, గ్రంథాలయ చైర్మన్ అనిల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు, ఎంఆర్ మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు రాజేందర్, అధ్యక్షుడు నాంచారి రాజయ్య, ప్రధాన కార్యదర్శి వేదంతం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చల్ల హరికృష్ణ, శ్రీరామ్ నరేందర్, కమిటీ సభ్యులు, కుల పెద్దలు, మున్నూరు కాపు మహిళలు పెద్ద ఎత్తున పోచమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News