Wednesday, December 25, 2024

పటాన్‌చెరులో 13న బోనాల పండుగ

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: పటాన్‌చెరు పట్టణంలో ఈనెల 13న బోనాల పండుగ నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పట్టణ ప్రజలకు తెలిపారు. మంగళవారం పటాన్‌చెరు పట్టణంలోని కోదండ రామస్వామి ఆలయంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ అధ్యక్షతన పట్టణ పెద్దల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం పట్టణ పెద్దల సమక్షంలో జరిగిన తీర్మణం మేరకు బోనాల పండుగ గతంలో నిర్వహించిన విదంగా కాకుండా ఈసారి ఈ నెల 13న గురువారం నిర్వహించే విధంగా నిర్నహించినట్టుగా చెప్పారు. గతంలో ఆదివారం, సొమవారం నిర్వహించామని పట్టణ ప్రజల విజ్ఞప్తి మేరకు మార్పు చేశామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున పండుగకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన్‌దేవ్, నాయకులు మధుసూదన్ రెడ్డి, అఫ్జల్ పట్టణ ప్రముఖులు హాజరైయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News