Wednesday, January 22, 2025

కనుల పండువగా సాగిన కైలాశ్‌నగర్ బస్తీలో బోనాల తొట్టెల ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : తెలంగాణ జనజీవన సంస్కృత, భక్తి సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలు కేలాశ్‌నగర్‌లో భక్తుల నీరాజనల మద్య భక్తి పారవశ్యంతో పారంభమయ్యాయి. భక్తి ఉత్సాహం, అమ్మవారి స్తుతిస్తూ మిన్నంటిన నినాదాలు, బ్యాండ్ మేళాల మద్య యువత చిందుల మద్య తొట్టెల ఊరేగింపు ఘనంగా సాగింది. తొలుత కైలాశ్‌నగర్ బస్తీలో బోనాల ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న విభిన్న రంగుల ఆకర్షణీయ తొట్టెలకు తొలుత పూజాదికాలు నిర్వహించారు. అనంతరం తొట్టెల ఊరేగింపులో అడుగడుగున జయజయధ్వనాల మద్య భక్తులు స్వాగతించారు. ఏటా తరహాలోనే బోనాల ఉత్సవాల ముందు సంప్రదాయంగా బస్తీలో తొట్టెల ఊరేగింపుగా బస్తీ నుంచి మొదలై మెహిదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, మిలటరీ ఏరియా, లంగర్‌హౌస్ మీదుగా గోల్కొండ పైన శ్రీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నది.

ఈ సందర్బంగా యువత ఉత్సాహపూరిత వాతావరణం మద్య నృత్యాలు చూపరుల దృష్ఠిని ఆకట్టుకున్నది. డప్పువాయిద్యాల హోరులో జై మాతాజీకి జై, బోనాల అమ్మవారికి జేజేలు, జై తెలంగాణ అంటూ నినాదాలు వీదుల్లో హోరెత్తాయి. పోతరాజలు వీరంగం ప్రత్యేక ఆకర్షణ.. తొట్టెలను చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపారు. బస్తీవాసులు బి.మల్లేశ్, ప్రేంరావు, శివకాంత్,కిషన్, హరీష్, శ్రీకాంత్ బస్తీ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ బోనాల మన సంస్కృతి, సంప్రదాయలను అద్దంపడుతున్నాయని, ఈ సందర్బంగా ప్రజలకు చింతకుంట సంజయ్ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు.అమ్మవారి దయా, చల్లని చూపుతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News