Sunday, November 17, 2024

ఆనందోత్సాహాల అంబరాన్ని తాకిన బోనాల సంబరాలు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : తెలంగాణ ఆషాడ మాసం బోనాల సంబరాలను ఉద్యోగులు, భక్తులు ఆనందోత్సాహాల మద్య ధూంధంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బోనాల ప్రాముఖ్యత, విశిష్ఠతను చాటేలా పలు భక్తి కార్యక్రమాలు, శక్తిమంతురాలైన అమ్మవారికి భక్తి పారవశ్యంతో నీరాజనలు పలికారు. బుధవారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని రాష్ట్ర ప్రొటోకాల్ ఉద్యోగులు శ్రీ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలను ఈ ప్రాంతం సంస్కృతి, ఆచరాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. తొలుత ఆలయంలో కొలువుదీరిని అమ్మవారికి వేద మంత్రాల నడుమ అభిషేకం, కుంకుమార్చన, పూజలు, హారతి వంటి కార్యక్రమాలు జరిగాయి.

తర్వాత భక్తులు మాతేశ్వరిని ప్రసన్నం చేసుకునేందుకు నైవేద్యాలు సమర్పించి కొలిచారు. మహిళలు సంప్రదాయంగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందుంచారు. జై అమ్మవారికి జై. జై తెలంగాణ, బోనాల ఉత్సవాలు జై అంటూ నినాదాలు హోరెత్తాయి. పోతరాజుల వీరంగం, భక్తి నినాదాలు, డప్పువాయిద్యాల నడుమ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ…. ఉద్యోగులు అమ్మవారిని భక్తి ప్రవత్తులతో దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విచ్చేసి అమ్మవారికి పూజలు నిర్వహించారు.

రాష్ట్ర శాసనమండలి సభ్యుడు బొగ్గారపు దయానంద్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఖాదర్‌బిన్ హసన్, టీఎన్జీవో కేంద్ర సంఘం కోశాదికారి రామినేని శ్రీనివాస్‌రావు, సహాధ్యక్షుడు కాస్తురి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు జి. శ్రీనివాస్ గౌడ్, నగర టీఎన్జీవో సీనియర్ నాయకులు కట్కూరి శ్రీకాంత్, రాష్ట్ర ప్రొటోకాల్ టీఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, కార్యదర్శి హిమాబిందు, నగర నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, సిటీ టీఎన్జీవో అడ్‌హక్ కమిటీ కన్వీనర్ హరి ఇతర శాఖ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News