Monday, December 23, 2024

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఘనంగా బోనాలు

- Advertisement -
- Advertisement -

Bonalu celebrations in Melbourne

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీకి, సంప్రదాయాలకు ప్రతీకమైన బోనాల పండుగను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలోని దుర్గా మాత ఆలయంలో మెల్‌బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారికి బోనాలు, తొట్టెల సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు. పోతురాజుల ఆట, పాటలు, యువకుల నృత్యాలతో దుర్గామాత ఆలయంలో సందడి చేశారు. బోనాల పాటలకు చేసిన నృత్యాలకు భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ వేడుకలను అదే స్థాయిలో 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మెల్‌బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, కాసర్ల నాగేందర్ రెడ్డి, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి కోతి, దీపక్ గద్దెలను ఈ వేడుకలకు హాజరైన వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News