Friday, December 27, 2024

సాలంపాడ్ గ్రామంలో వైభవంగా బోనాల పండుగ

- Advertisement -
- Advertisement -

 

 

బోధన్ రూరల్ : బోధన్ మండలంలోని సాలంపాడ్ గ్రామంలో ఆదివారం వైభవంగా బోనాల పండుగను జరుపుకున్నారు. మహిళలు తమ తమ ఇండ్ల నుంచి బోనాలను ఎత్తుకొని భాజా భజంత్రీలతో ఊరేగింపుగా గ్రామ ప్రధాన కూడలిలా గుండా గ్రామ దేవతల వద్దకు చేరుకున్నారు. గ్రామ దేవతలకు బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుష్ప నర్సారెడ్డి, గ్రామపెద్దలు బసవంత్ రావు, నర్సారెడ్డి, ముంజ గంగారాం, మల్లయ్య, గోపాల్ రెడ్డి, మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News