Sunday, January 19, 2025

ముగిసిన మహంకాళి బోనాల జాతర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఘనంగా ముగిశాయి.  కాగా మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి శివమెత్తి భవిష్యవాణి తెలిపింది. భవిష్యత్తులో ఏమి జరుగనుందో తెలుసుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమె ఈ ఏడాది వానలు విపరీతంగా పడనున్నాయని పేర్కొంది. మట్టి కుండ బోనం అయినా, బంగారు బోనం అయినా తనకు సమ్మతమేనని మాతంగి పేర్కొంది. పిల్లలకు, గర్భిణులకు, వృద్ధులకు ఎలాంటి ఆపదలు రానివ్వబోనని అమ్మవారు పూనిన ఆమె తెలిపారు.  రంగం కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నత అధికారులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News