Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో బోనాలకు పెద్దపీట : ఎంఎస్ ప్రభాకరరావు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : హిందూ ధర్మ భక్తి సంస్కృతి వ్యాప్తికి, తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని ఎలుగెత్తి చాటేలా బోనాల ఉత్సవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా ఆలయ కమిటీలకు నిధులు ఇస్తోందని రాష్ట్ర శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బోనాల ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధ్దలు, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు ఆలయ కమిటీలకు నిధులు సమకూర్చుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సోమవారం నాంపల్లిలోని శ్రీపోచమ్మ ఆలయ ప్రాంగణంలో నాంపల్లి నియోజకవర్గంలోని బోనాల ఉత్సవాల సందర్భంగా సు మారు 60 పైగా ఆలయ కమిటీలకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను ప్రతి బస్తీలు, ప్రాంతాల్లో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఈ తరహా పం డుగ ఉత్సవాలను ప్రొత్సాహించడం, భక్తిభావాలను పెంచే దిశగా రాష్ట్ర ప్ర భుత్వం ఆలయాల కమిటీలకు ఆర్థిక సహాయం అందిస్తోందని, ఈ పద్ధ్దతి గత కాంగ్రెస్, టీడీపీ హయాంలో లేదని పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలను సంతోషంగా, భక్తి భావాలతో నిర్వహణకు డబ్బులు ఇవ్వడం అభినందనీయమన్నారు.

నగర వ్యాప్తంగా బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల మతాల పండుగలకు నిధులతోపాటు కీట్లు, దుస్తులు తదితర అందిస్తున్నారని, అందరి పట్ల సమాన దృష్టితో చూస్తున్నారని కితాబిచ్చారు. నాంపల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జీ సీహెచ్ ఆనందకుమార్ గౌడ్ ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులకు స్వాగతించారు. విజయనగర్‌కాలనీ శ్రీ హనుమాన్ ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీనివాస్ శర్మ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ అగర్వాల్, బిఆర్‌ఎస్ నాయకులు చింతకుంట సంజయ్, నరేందర్‌కుమార్ పటేల్, మెట్టు నటరాజ్, అభిషేక్ రాజ్, ఎ.సంజీవ్ యాదవ్, ఎ.శ్రీనివాసాచారి, మురళీధర్ వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News