Thursday, January 23, 2025

కల్వకుర్తిలో ఘనంగా బోనాలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పోతరాజు బోనాలను పట్టణ వాసు లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి పురవీధుల గుండా భారీ ర్యాలీతో బోనాలను ఊరేగింపుగా నజర్ నగర్ బోనాలను పోతరాజు ఆలయం వద్దకు అలాగే పోచమ్మ దేవాలయం వరకు బోనాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బోనాల పండుగ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, మాజీ చైర్మెన్ శ్రీశైలం, వైస్ ఎంపి పి కొండూరు గోవర్ధన్, శ్రీనివాస్ యాదవ్, బన్నె శ్రీధర్ కురుమ, శివాలయం శేఖర్ యాదవ్, భగత్ సింగ్, మదన్ మురళి, కుమ్మరి శ్రీను, బాలస్వామి, సతయ్య, గౌడ అధ్యక్షులు కార్వంగ శ్రీనివాస్ గౌడ్, తాలుకా జనరల్ సెక్రటరి రాఘవేంద్ర గౌడ్, ఉపాధ్యక్షులు రవి గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు రుక్కులు గౌడ్, కౌన్సిలర్లు సైదులు గౌడ్, నాగేష్ గౌడ్, ఆనంద్ గౌడ్, నరేష్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News