Sunday, December 22, 2024

బాండ్ల నెంబర్లనూ బయటపెట్టాలి

- Advertisement -
- Advertisement -

ఎస్‌బిఐకి సుప్రీంకోర్టు ఆదేశం
ఎలక్టోరల్ బాండ్స్‌లో ‘మేఘా’స్టార్
పార్టీలకు చందాల్లో రెండో స్థానం
కీలక రంగాలలో అచిర కాలంలోనే తనదైన ముద్ర

బాండ్లపై దర్యాప్తు జరిపించాలి : ఖర్గే

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల కొనుగోలు, విత్‌డ్రాయల్‌కు సంబంధించి ఇప్పటికే వెల్లడించిన వివరాలతోపాటు బాండ్ల నంబర్లను కూడా బహిర్గతం చేయాలని భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బిఐ)ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. దీనిపై తన వైఖరిని తెలియచేయాలని కోరుతూ ఎస్‌బిఐకి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం నోటీసు జారీచేసింది. అంతేగాక ఎన్నికల కమిషన్ సీల్డ్ కవర్‌లో సమర్పించిన కొన్ని పత్రాలను వాపసు చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 12వ తేదీ బిజినెస్ అవర్స్ ముగిసేలోగా ఎన్నికల కమిషన్‌కు అందచేయాలని మార్చి 11న ఆదేశించిన సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల నంబర్లను ఎస్‌బిఐ బహిర్గతం చేయకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News