Friday, December 20, 2024

21లోగా బాండ్ల నంబర్లు చెప్పాలి: ఎస్బీఐకి సుప్రీం ఆదేశం

- Advertisement -
- Advertisement -

ఎన్నికల బాండ్లకు సంబంధించిన యునిక్ సీరియల్ నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 21వ తేదీలోగా తమ వద్ద ఉన్న అన్ని వివరాలను ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారో తెలియజేసే నంబర్లతోపాటు అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చి తీరాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అన్ని వివరాలను సమర్పించామని పేర్కొంటూ 21వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐని ఆదేశించింది. ఎస్బీఐ ఇచ్చిన వివరాలను వెంటనే తమ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News