Wednesday, January 22, 2025

పట్టాలకు చట్టబద్దత లేదు…. పేదలను జగన్ మోసం చేస్తున్నారు: బోండా

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: సెంటు పట్టాల పేరుతో సిఎం జగన్ మోహన్ రెడ్డి నాటకమాడుతున్నారని టిడిపి నేత బోండా ఉమ విమర్శించారు. శుక్రవారం సిఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న సందర్భంగా బోండా మీడియాతో మాట్లాడారు. అమరావతిపై కక్షతోనే సెంటు పట్టాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. మౌలిక వసతులు కూడా లేని పట్టాలను పేదలు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. సెంటు పట్టాలకు చట్టబద్దత లేదని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా పేదలను సిఎం జగన్ మోసం చేస్తున్నారని బోండా మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News