Sunday, December 22, 2024

మహారాష్ట్రలో దారుణం: సంకెళ్లు వేసి కూలీలతో వెట్టిచాకిరీ

- Advertisement -
- Advertisement -

ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా పోలీసులు కాళ్లకు సంఎళ్లు వేసి కూలీల చేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్న కొందరుకాట్రాక్టర్ల ఆట కట్టించి 11 మంది కూలీలకు విముక్తి కల్పించారు.

బావి త్వేందుకు తమ చేత కాట్రాక్టర్లు వెట్టి చాకిరీ చేయించుకున్నారని, వేతనం లేకుండా రోజుకు 12 గంటలు పనిచేయించుకున్నారని కాంట్రాక్టర్ల చెర నుంచి విముక్తి పొందిన కూలీలు గత శానివారం తమ వెతలను మీడియాకు వివరించారు. రోజుకు ఒక పూట మాత్రమే తిండి పెట్టేవారని, బయటకు రానివ్వడానికి అనుమతించకపోవడంతో బావిలోనే మలమూత్రాల విసర్జన చేసేవారమని ఆ కూలీలు వాపోయారు.ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు కాంట్రాక్టతోసహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక ఓలీసు అధికారి వెల్లడించారు.

ఉస్మానాబాద్ జిల్లాలోని ధోకీ పోలీసు స్టేషన్ పరిధిలోగల ఖమస్‌వాడి, వఖర్‌వాడి గ్రామాలలో బావులు తవ్వేందుకు ఈ కూలీలను 2, 3 నెలల క్రితం కాంట్రాక్టర్లు నియమించారు. ఆ కూలీలను నిర్బంధించి, వారికి జీతభత్యాలు చెల్లించకుండా వారి చేత కాంట్రాక్టర్లు వెట్టిచాకిరీ చేయించుకుని, చిత్రహింసలకు గురిచేశారని అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జగదీష్ రౌత్ తెలిపారు.

కూలీలలో ఒక వ్యక్తి తప్పించుకుని హింగోలీ జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకోవడంతో ఈ వ్యదారుణం బయటపడింది. ఆ కూలీ స్థానిక పోలీసులకు ఈ విషయం తెలియచేయడంతో వెంటనే వారు ఉస్మానాబాద్‌లోని ధోకీ పోలీసు స్టేషన్‌ను శనివారం అప్రమత్తం చేశారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆయా ప్రదేశాల వద్ద దాడులు జరిపి వెట్టిచాకిరీ చేస్తున్న కూలీలను విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News