హైదరాబాద్: కోవిడ్ వచ్చిన వెళ్లిన తరువాత అనేక రకాలైన సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు, ఈమధ్యకాలంలో కాళ్లు, చేతులు, కీళ్లలో వాపులు వస్తున్నాయని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు డా. సాయి లక్ష్మణ్ అన్నె పేర్కొన్నారు. ఈ పరిస్దితిని రియాక్టివ్ అర్ద్రాల్జియా అంటారని, అంటు వ్యాధుల తరువాత సాధారణంగా రోగుల్లో ఇలాంటివి సంభవిస్తాయన్నారు. శరీరంలో వైరల్ సంక్రమణ తగ్గిన కొన్ని వారాల తరువాత ఇది ప్రారంభమైతుందని చెప్పారు. వాపు రావడం కీళ్ల నొప్పుల ఇబ్బంది పెడుతాయని, ఇక్కడ కండరాల ఆస్దిపంజర వ్యవస్ద ఏదైనా భాగం ప్రభావితచేస్తుందన్నారు.
రియాక్టివ్ ఆర్ధ్రాల్జియా చికెన్ గున్యా జ్వరం, డెంగ్యూ జ్వరం వచ్చిపోయిన తరువాత సాధారణంగా వస్తాయని, ఇది కోవిడ్ తగ్గిన రోగుల్లో 20 నుంచి 30శాతం మంది రోగుల్లో గమనించినట్లు తెలిపారు. ఈవ్యాధి ఆకస్మిక పెరుగుదలను ఇటీవల ఎక్కువగా ఉందని, ఆలసట ఎదుర్కోవడానికి రోగ నిరోధకశక్తి పెంచే మంచి సాధనం వ్యాయామం. ఆలసటతో పోరాడటానికి ప్రజలు అవలంబించే మరో మార్గం అధిక మోతాదులో ప్రోటిన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం. సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించినప్పుడు నిరంతరంగా బలహీనత, కండరాలు నొప్పులు ఉంటాయన్నారు. ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కూడా కీళ్లలో ఆకస్మాత్తుగా నొప్పులు పెరుగుతాయన్నారు. అలాగే కండరాల నొప్పులు కూడా తీవ్రమవుతాయని, ముందుగా ఉన్న డీజెనరేటివ్ ఆర్దరైటివ్, ప్రభావాలు తరుచుగా రోగిని నిర్వీర్యం చేస్తాయని పేర్కొన్నారు.