Monday, December 23, 2024

ఎముక మజ్జ మార్పిడితో లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) నయం

- Advertisement -
- Advertisement -

అస్తవస్తంగా విభజన చెంది ఏర్పడిన కణ సమూహాలనే క్యాన్సర్లు అంటారు. క్యాన్సర్లో కార్సినోమా, సార్కోమా, లుకేమియా, లింపోమా అనే నాలుగు రకాలున్నాయి. అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. వైద్య పరిభాషలో బ్లడ్ క్యాన్సర్‌ను లుకేమియా అంటారు. మనదేశంలో ఎక్కువగా వస్తున్న క్యాన్సర్ కేసుల్లో ఎనిమిది శాతం బ్లడ్ క్యాన్సర్ కేసులే ఉంటున్నాయి.

ఈ బ్లడ్ క్యాన్సర్ లో ఉన్న రకాల్లో లింఫోమా, లుకేమియా, మల్టిపుల్ మెలోమా ఈ మూడు రకాలే మన దేశంలో కనిపిస్తుంటాయి. రక్త కణాలను ఉత్పత్తి చేసే ఎముక మజ్జ (bone marrow) లో ప్రారంభమయ్యే క్యాన్సర్ రకాలను లుకేమియా అంటారు. ఎముక మజ్జ అనేది ఎముకలో ఉండే మృధువైన కణజాలం. దీనిలో పూర్తిగా అభివృద్ది చెందని రక్త కణాలు ఉంటాయి. అవి తర్వాత ఎర్ర రక్త కణాలు (rbc ), తెల్ల రక్త కణాలు (wbc ) పేట్లెట్లు ( platelets) గా అభివృద్ది చెందుతాయి.

అభివృద్ధి చెందని తెల్ల కణాలను లుకేమియా అంటారు. అయితే లుకేమియా వ్యాధి గురించి ఇకపై అంతగా భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. ఎముక మజ్జ (bone marrow) మార్పిడితో దీన్ని పూర్తిగా తొలగించవచ్చని అంటున్నారు. ఈ ప్రక్రియలు ఇప్పుడు విజయవంతం అవుతున్నాయి. ఆధునిక పరికరాల సాయంతో 7080 ఏళ్ల వయోవృద్ధ రోగులకు కూడా ఈ ప్రక్రియ నిర్వహించడం సాధ్యమవుతోంది.. స్టెమ్ సెల్ డోనార్ అంటే మూలకణాల దాత అంటే చాలా మందికి అపోహలున్నాయి. రక్త దానం ఎలా చేయవచ్చునో ఇది కూడా మరొకరికి ఇవ్వవచ్చు. ఇలా దానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కేవలం కొన్ని రకాల మందులు వాడవలసి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యుడు అయితేనే బోన్ మారో అంటే ఎమకమజ్జ మూలకణాలు దానం ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు.

ఇది రక్తం లేదా ఎముక మజ్జ (bone marrow)లో వస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరిగినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఈ క్యాన్సర్ కణాలు రక్తంలో కలిసి శరీరమంతా వ్యాపిస్తాయి. ఇతర క్యాన్సర్లలా ఈ క్యాన్సర్ కణితులుగా కనిపించదు. ఎక్స్‌రే వంటి ఇమేజింగ్ పరీక్షల్లో మాత్రమే వీటిని గుర్తించ గలరు. 10 లక్షల మందిలో 35 మందికి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. బ్లడ్ క్యాన్సర్ క్రోనిక్, అక్యూట్ అనే రెండు రకాలు. ఈరెండిటికీ చికిత్స వేర్వేరుగా ఉంటుంది. చివరి దశకు చేరుకుంటేనే ఈ క్యాన్సర్ లక్షణాలు బయటపడతాయి.

ఆకలి లేకపోవడం, అలసట, నీరసంగా ఉండటం, ఏపాటి చిన్నగాయమైనా రక్రస్రావం ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు ఎక్కువగా చెమటపట్టడం, శరీరం బరువు తగ్గిపోవడం, ఎముకలు, కీళ్లలో విపరీతమైన నొప్పులు , ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఎవరికైనా లుకేమియా వస్తే ఎలా వచ్చిందో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే కొన్ని క్యాన్సర్ కారకాలు, రేడియేషన్‌కు గురి కావడం, వంటి కారణాల వల్ల లుకేమియా వస్తుంది. ధూమపానం , మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ ఎక్కువవుతుంది. కుటుంబ చరిత్ర బట్టి కొందరికి రావచ్చు. అలాగే పుట్టుకతో డౌన్ సిండ్రోమ్ , ఇతర సిండ్రోమ్‌ల వల్ల ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

ఈ క్యాన్సర్ వచ్చే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పొగతాగడం, మద్యం సేవించడం మానుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. రెడ్ మీట్ దూరంగా ఉంచాలి.వీలైనంతవరకు చక్కెర తినకుండా ఉండడం మంచిది.కూల్ డ్రింక్స్, స్వీట్లు , ఎనర్జీ డ్రింక్స్ మానేయాలి. విషరసాయనాల నివారణ గుణాలు ఎక్కువగా ఉన్న పసుపు బాగా పనిచేస్తుంది. అలాగే వెల్లుల్లి లోని ఫైటో కెమికల్స్ ఉన్నందున క్యాన్సర్ కారకాలను నివారిస్తాయి. టమోటాల్లో ఉండే లైకోపిన్ అనే పదార్ధం క్యాన్సర్ నివారణలో బాగా ఉపయోగపడుతుంది. ఆకుకూరల్లోని పోషక విలువలు డిఎన్‌ఎకు రక్షణగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News