Wednesday, January 22, 2025

ఎముక మజ్జ మూల కణాల మార్పిడి

- Advertisement -
- Advertisement -

తలసీమియా పిల్లలకు సరైన వైద్య చికిత్స ఎముక మజ్జ మూలకణాల మార్పిడి వల్లనే సాధ్యమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పిల్లలకు హెచ్‌ఎల్‌ఎ యాంటిజెన్ సరిపోయే పిల్లలు దొరికితేనే ఇది సాధ్యమవుతుంది. హెచ్‌ఎల్‌ఎ అంటే హ్యూమన్ లుకోసైట్ యాంటిజెన్ ( హెచ్‌ఎల్‌ఎ). హెచ్‌ఎల్‌ఎ అనేది శరీరంలో చాలా కణాల్లో కనిపించే ప్రొటీన్లు లేదా గుర్తులు. శరీరం లోని రోగ నిరోధక వ్యవస్థ ఏ కణాలకు చెందినదో గుర్తించడానికి ఈ గుర్తులు ఉపయోగమవుతాయి. ఒక వ్యక్తి కణజాల రక్తాన్ని గుర్తించడానికి ఉపయోగపడే పరీక్షనే హెచ్‌ఎల్‌ఎ టైపింగ్ అని అంటారు.

ఈ ఎముక మజ్జ మార్పిడికి వైద్యులలో చాలా నైపుణ్యం ఉండాలి. అంతేకాక ఎక్కువగా ఖర్చుపెట్టవలసి వస్తుంది. ఇవన్నీ కుదిరితే 3 నుంచి 7 ఏళ్ల లోనే పిల్లల్లో వైద్య చికిత్స సమర్ధంగా అందుతుంది. పిల్లలకు 18 ఏళ్లు వచ్చినా ఈ చికిత్స వల్ల మేలు జరుగుతుంది. దీనివల్ల తలసీమియా నయమైతే మిగతా పిల్లల మాదిరిగా తలసీమియా పిల్లలు మనుగడ సాగించ గలుగుతారు. ఇవన్నీ ఇలా ఉండగా ఇదివరకులా తలసీమియా ప్రాణాంతకమని భయపడవలసిన పనిలేదు. ఇప్పుడు వైద్యపరంగా అత్యంత ఆధునిక పద్ధతులు అమలులోకి రావడం వల్ల తలసీమియాను నివారించే మార్గాలు సులువవుతున్నాయి. హెచ్‌ఎల్‌ఎ సరిగ్గా మ్యాచ్ కాకపోయినా, ఇతర వైరుధ్యాలు ఉన్నా సరే తలసీమియా రోగులను బాగు చేయగలుగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News