Saturday, December 21, 2024

కాలిబాటలో బోన్లు ఏర్పాటు చేస్తాం: టిటిడి ఇఒ

- Advertisement -
- Advertisement -

అమరావతి: రెండు కాలిబాటలను సాయంత్రం ఆరు గంటల నుంచి మూసివేయాలని ఆలోచన చేస్తన్నామని టిటిడి ఇఒ ధర్మారెడ్డి వెల్లడించారు. టిటిడి చైర్మన్, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమల జెఇఒ కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఇఒ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్ర 6.30 గంటలకు పాప మిస్ అయిందని ఇఒ తెలిపారు. పాప ఆచూకీ కోసం 70 మంది సిబ్బంది వెతికారని, శుక్రవారం రాత్రి అటవీ ప్రాంతంలో సిబ్బంది గాలించారని, సిసి కెమెరాల ద్వారా చూస్తే కాలినడక మార్గంలో జరగలేదని తెలిపారు.

Also Read: మాది కోతల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: కెటిఆర్

కాలినడక నుంచి పాప అటవీ ప్రాంతంలోకి వెళ్లిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పాప మృతి చాలా బాధాకరమన్నారు. ప్రతి పది మీటర్లకు సెక్యూరిటీ గార్డును నియమిస్తామని, కాలిబాటలో వచ్చే భక్తులు చిన్ని పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలిబాటలో బోన్లు ఏర్పాటు చేస్తామని, చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండో బోన్లు ఏర్పాటు చేశామని ధర్మారెడ్డి వివరించారు. కాలినడకన తిరుమలకు వెళ్తుండగా పాపపై చిరుత పులి దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News