Thursday, December 19, 2024

మహేశ్ బాబు వ్యాఖ్యపై స్పందించిన బోనీ కపూర్, రామ్ గోపాల్ వర్మ

- Advertisement -
- Advertisement -

Bony, Mahesh, Verma

హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు బాలీవుడ్‌పై  ఇటీవల చేసిన కామెంట్స్‌ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.  మేజర్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మహేశ్‌ బాబు మాట్లాడుతూ ‘‘బాలీవుడ్‌ తనని భరించదని, అందుకే అక్కడ సినిమాలు చేసి సమయం వృధా చేసుకొను’’ అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మహేశ్‌ వ్యాఖ్యలు అటు బాలీవుడ్‌లో , ఇటు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆయన కామెంట్స్‌ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ స్పందించాడు. మహేశ్‌ వ్యాఖ్యలపై తన అభిప్రాయం చెప్పమని బోనీ కపూర్‌ను ఓ అంగ్ల మీడియా కోరింది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘మహేశ్‌ వ్యాఖ్యలపై స్పందించడానికి నేను సరైన వ్యక్తిని కాదు. నేను ఉత్తరాదితో పాటు దక్షిణాదికి కూడా చెందిన వాడిని. ఇప్పటికే తెలుగు, తమిళంలో సినిమాలు నిర్మించాను. త్వరలోనే కన్నడ, మలయాళంలో కూడా తీయబోతున్నా. కాబట్టి నేను ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడే హక్కు మహేశ్‌కు ఉంది. బాలీవుడ్‌ తనని భరించలేదని అతను అనుకుని ఉండొచ్చు. అలా చెప్పడానికి అతడి దగ్గర తగిన కారణాలు కూడా ఉండిఉంటాయి. ఎవరి అభిప్రాయం వారిది’ అన్నారు.

ఇదిలావుండగా వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా మహేశ్‌ వ్యాఖ్యలపై  స్పందించాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో  ‘మహేశ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ సినిమాలు చేయాలి, ఎలాంటి కథలు  ఎంచుకోవాలన్నది నటుడిగా తన సొంత నిర్ణయం’ అన్నాడు. ఇక బాలీవుడ్‌ తనని భరించలేదంటూ మహేశ్‌ చేసిన వ్యాఖ్యలు తనకు అర్థం కాలేదన్నాడు.  బాలీవుడ్‌ అనేది ఒక కంపెనీ కాదని, మీడియా వాళ్లే ఆ పేరు సృష్టించారని వర్మ  అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News