Monday, January 20, 2025

నటి శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకంపై బోనీ కపూర్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

ముంబై: సినీ నిర్మాత బోనీ కపూర్ తన దివంగత భార్య, నటి శ్రీదేవిపై బయోగ్రఫీ తీసుకొస్తున్నట్లు, దానికి ‘ద లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్’ అని పేరుపెట్టిన్నట్లు ప్రకటించారు. ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘శ్రీదేవి సహజంగానే ఓ శక్తి. ఆమె తన సినిమాలను షేర్ చేసుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. కానీ వ్యక్తిగతంగా ఆమె చాలా ప్రైవేట్ పర్సన్’ అన్నారు. శ్రీదేవి తన కుటుంబ సభ్యుడిగా భావించే ధీరజ్ కుమార్ ఆమె జీవిత చరిత్రపై పుస్తకాన్ని రాస్తున్నారు. ‘ధీరజ్ కుమార్ రచయిత, కాలమిస్ట్, పరిశోధకుడు. అతడిని శ్రీదేవి తన ఇంటి మనిషిగా భావించేది. అతడు ఆమె అసాధారణ జీవితం గురించి పుస్తకం రాస్తుండడం మాకు ఆనందాన్ని ఇస్తోంది’ అన్నారు.

భారతీయ సినిమాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి. ఆమె సంపూర్ణ జీవిత చరిత్ర గురించి తెలిపేదే ఆ పుస్తకం. ఆమె తన 50 ఏళ్ల కాలంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో 300కు పైగా సినిమాల్లో నటించింది. శ్రీదేవికి పద్మశ్రీ, నేషనల్ ఫిల్మ్ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు లభించాయి.

Sridevi Biopic

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News