- Advertisement -
ముంబయి: సంధ్య థియేటర్ ఘటనపై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మద్దతు పలికారు. ఆ ఘటనలో నటుడు అల్లు అర్జున్ ను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. చిరంజీవి, రజనీకాంత్, అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమాలకు మొదటి రోజు ప్రేక్షకులు చాలామంది వస్తారని తెలిపారు. ఆ రోజు థియేటర్ దగ్గర కొన్ని వేల మంది ఉన్నారని, అంత మందిని చూడడం అదే మొదటిసారి అని పేర్కొన్నారు. అనుకోకుండా జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని కపూర్ స్పష్టం చేశారు. ఆర్ టిసి క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
- Advertisement -