Saturday, January 18, 2025

నేను వేరే పార్టీలో చేరట్లేదు: బొంతు రామ్మోహన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను బిఆర్ఎస్ పార్టీని ఎప్పటికీ వీడబోనని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఉద్యమ కాలం నుండి గత 21 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి ఒక సైనికుడిలా పని చేస్తున్నానని ఆయన వెల్లడించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా రాజకీయ గురువు సిఎం కెసిఆర్. పదవుల కోసం పార్టీలు మారే సంస్కృతి నాది కాదన్నారు. నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కి, అలాగే మా పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని బొంతు రామ్మోహన్ సూచించారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి, కేసీఆర్ తెలంగాణకి హ్యాట్రిక్ సీఎం అవుతారని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News