Wednesday, December 25, 2024

బోనస్‌తో సన్నాలకు జోష్

- Advertisement -
- Advertisement -

ఈ ఖరీఫ్‌లో 66.78 లక్షల ఎకరాల్లో
వరి సాగు 40.55 లక్షల ఎకరాల్లో
సన్నాలు పండించిన రైతులు
ఇప్పటివరకు 47.01 లక్షల మెట్రిక్
టన్నుల ధాన్యం కొనుగోలు చేసి,
రూ.10,903 కోట్ల్లు చెల్లించిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ :బోనస్‌తో సన్నాల సాగు పెరిగింది. సన్నవడ్లకు ప్రభుత్వం బోనస్ ప్ర కటించటంతో ఈసారి సన్న రకాల వరిసాగు వి స్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే సన్న రకాల వరిసాగుతో రైతుల పంట పండింది. ఖరీప్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.10,149 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేసింది. 2023 ఖరీఫ్ సీజన్‌లో మొత్తం వరి సాగైన విస్తీర్ణంలో 38 శాతం కేవలం 25.05 లక్షల ఎకరాల్లో సన్న రకం పండించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ లో (2024) రికార్డు స్థాయిలో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, అందులో 61 శాతం దా దాపు 40.55 లక్షల ఎకరాల్లో రైతులు సన్న ధా న్యం పండించారు. మిగతా 26.23 లక్షల ఎకరా ల్లో దొడ్డు రకాలను సాగు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం ఈసారి సన్నవడ్లకు రూ.500ల బోనస్ చెల్లించింది. సన్న రకాల వరిసాగును ప్రోత్సహించటంతో పాటు బోనస్ చెల్లిం పు రైతులకు అదనంగా లబ్ధి చేకూర్చింది.

రాష్ట్రం లో దాదాపు 3.36 లక్షల మంది రైతులు ఈ సారి సన్నవడ్ల బోనస్ అందుకున్నారు. ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో ఇప్పటివరకు 18.78 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసిం ది. వీటికి అదనంగా ఇచ్చే బోనస్ ప్రకారం రూ. 939 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.591 కోట్ల చెలింపులు చేసింది. రాష్ట్రంలో ఇ ప్పటివరకు 47.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 28. 23 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 18.78 ల క్షల మెట్రిక్ టన్నులు సన్న రకం. ధాన్యం సేకరణలో కామారెడ్డి, ని జామాబాద్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాలు

గతేడాది 2023 ఖరీఫ్ సీజన్‌లో 41.20 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు చేయగా ఈ ఏడా ది అంతకంటే 6 లక్షల మెట్రిక్ ట న్నులు ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం ఇప్పటివరకు రూ.10,903 కోట్ల విలువైన ధా న్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చే సింది. అందులో రూ.10,149 కోట్ల చెల్లింపులు చే సింది. మొత్తం 8.84 లక్షల మంది రైతుల నుంచి ఈసారి ధాన్యం సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి 8,318 కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టింది. ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో ఈసారి సివిల్ సప్లయ్ విభాగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఈదురు గా లులు, అకాల వర్షాలకు కూడా రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు చేపట్టింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో కామారెడ్డి, ని జామాబాద్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.2024,25 సంవత్సరంలో ఖరీఫ్‌కు సంబంధించి 23.12. 2024 వరకు ప్రభుత్వం  కొనుగోలు చేసిన ధాన్యం సేకరణ వివరాలు ఇలా ఉన్నాయి.

23.12.2024 వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం సేకరణ వివరాలు ఇలా…
జిల్లా రైతులు చెల్లించిన మొత్తం
(రూ.కోట్లలో)

ఆదిలాబాద్ 534 రూ.3.68 కోట్లు
భద్రాద్రి కొత్తగూడెం 8,416 102.18
హన్మకొండ 19,222 183.83
జగిత్యాల 59,894 658.72
జనగాం 20,628 202.71
జయశంకర్ భూపాలపల్లి 7,574 56.26
జోగులాంభ గద్వాల్ 4,930 63.72
కామారెడ్డి 80,996 999.66
కరీంనగర్ 40,592 543.93
ఖమ్మం 31,888 361.12
కొమురంభీం ఆసిఫాబాద్ 798 5.10
మహబూబాబాద్ 23,350 180.26
మహబూబ్‌నగర్ 17,337 172.93
మంచిర్యాల 7,949 63.74
మెదక్ 73,508 667.08
మేడ్చల్ మల్కాజిగిరి 1,853 21.01
ములుగు 12,511 143.58
నాగర్‌కర్నూల్ 11,072 117.75
నల్లగొండ 46,359 531.23
నారాయణపేట 11,303 163.53
నిర్మల్ 24,866 234.37
నిజామాబాద్ 78,318 1137.36
పెద్దపల్లి 50,289 623.58
రాజన్న సిరిసిల్ల 36,655 484.14
రంగారెడ్డి 1,796 17.72
సంగారెడ్డి 29,306 369.97
సిద్దిపేట 60,974 584.24
సూర్యాపేట 38,403 389.66
వికారాబాద్ 9,033 85.95
వనపర్తి 28,886 301.82
వరంగల్ 21,122 192.73
యాదాద్రి భువనగిరి 24,086 486.30

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News