Monday, December 23, 2024

ఖమ్మంలో పుస్తక ప్రదర్శన ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటుచేసిన పుస్తక మహోత్సవాన్ని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, నగర మేయర్ పునుకోల్లు నీరజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్య పుస్తకాలను మాత్రమే కాకుండా పాఠ్యాంశయేతర పుస్తకాలను చదవాలని వాటి ద్వారానే జీవన విలువలు అలవడుతాయని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే దిక్సూచిగా పుస్తకాలు సరైన మార్గాన్ని చూపుతాయని అన్నారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించి, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, డిఈవో సోమశేఖర శర్మ, రచయిత ప్రసేన్, టూరిజం శాఖ జిల్లా అధికారి సుమన్ చక్రవర్తి, నిర్వాహకులు వి.దామోదర్, నరేష్ జిల్లా తదితరులు పాల్గొన్నారు.

  • నేటి గ్రీవెన్స్ డే రద్దు : కలెక్టర్ విపి.గౌతమ్

సోమవారం నిర్వహించు ప్రజావాణి కార్యక్రమం (గ్రీవెన్స్ డే)ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణ నేపథ్యంలో, అధికారులు వారికి కేటాయించిన విధులో పాల్గొనాల్సి ఉన్నందున జూన్ 12న సోమవారం నిర్వహించు ప్రజావాణి కార్యక్రమం (గ్రీవెన్స్ డే) రద్దు చేసినట్లు, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News