Tuesday, November 5, 2024

నెక్ట్స్‌ ప్రీమియా మాల్‌లో ప్రారంభమైన బుక్‌ ఫెయిర్‌..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అత్యంత అందుబాటు ధరలలో పుస్తకాలను విక్రయించడం ద్వారా ఖ్యాతి గడించిన కితాబ్‌ లవర్స్‌ సంస్థ , నగరంలో తొమ్మిది (9) రోజుల పాటు బుక్‌ ఫెయిర్‌ను నిర్వహించబోతుంది. ఈ బుక్‌ ఫెయిర్‌ మార్చి 25వ తేదీన ఇర్రమ్‌ మంజిల్‌ మెట్రో స్టేషన్‌తో అనుసంధానితమైఉన్న నెక్ట్స్‌ ప్రీమియా మాల్‌ లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ వద్ద ఏప్రిల్‌ 02 వ తేదీ వరకూ జరుగనుంది.

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బుక్‌ ఫెయిర్‌లో 20కు పైగా జెనర్స్‌లో 10 లక్షల కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఈ ఫెయిర్‌ గురించి కితాబ్‌ లవర్స్‌ ఫౌండర్‌ రాహుల్‌ పాండే మాట్లాడుతూ ు‘‘ హైదరాబాద్‌లో బుక్‌ ఫెయిర్‌ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నాము. నగరంలో మేము నిర్వహిస్తోన్న 5వ కార్యక్రమమిది. ఈ బుక్‌ఫెయిర్‌లో అత్యంత సరసమైన ధరలలో పుస్తకాలను అందిస్తుండటం వల్ల అధిక శాతం మంది పుస్తకప్రేమికులకు సంతోషాన్ని అందించగలుగుతున్నాము. చిన్నారుల నుంచి సీనియర్‌ సిటిజన్ల వరకూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే జెనర్‌లో పుస్తకాలు లభ్యమవుతాయి’’ అని అన్నారు.

భారతీయుల పుస్తకపఠన అలవాట్లను గురించి రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘మనం నేడు నివశిస్తోన్న డిజిటల్‌ ప్రపంచంలో , పుస్తక పఠనాసక్తి గణనీయంగా పడిపోతుంది. ఇంటర్నెట్‌, సోషల్‌మీడియా మనకు అసాధారణ వినోదం అందిస్తున్నప్పటికీ ఓ మంచి పుస్తకం అందించే విజ్ఞానం మాత్రం అందించలేవు. మరింత మంది మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తమ
పిల్లలతో సహా ఈ బుక్‌ ఫెయిర్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము’’ అని అన్నారు.

2019లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి భారతదేశ వ్యాప్తంగా 20 నగరాలలో 50కు పైగా బుక్‌ ఫెయిర్స్‌ను కితాబ్‌ లవర్స్‌ నిర్వహించింది. తమ ‘లోడ్‌ ద బాక్స్‌’ ప్రచారం ద్వారా, రీడింగ్‌ను అందుబాటులో ప్రతి భారతీయునికీ చేరువచేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ బుక్‌ ఫెయిర్‌లో ఉచిత రీడింగ్‌ కార్నర్‌ కూడా ఉంటుంది. అంతేకాకుండా నూతనంగా ఆవిష్కరించిన పుస్తకాల కోసం ప్రత్యేకంగా విభాగమూ ఇక్కడ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News